జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. మూడు పార్టీలకు సవాలే..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలైన బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిలకు సవాల్ గా మారింది. కేవలం అధికార కాంగ్రెస్ పార్టీకి ఇది పరువును నిలబెట్టుకునే ఎన్నికలనుకుంటే తప్పు. మిగతా రెండు పార్టీలకు కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంది. ఈ ఎన్నికలో గెలవడం కాంగ్రెస్ కు ఎంత ముఖ్యమో మిగతా రెండు పార్టీలకు అంతే ముఖ్యం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిన సందర్భంగా.. అభివృద్ధి లేదు.. ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది అనే ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో.. అవన్నీ తప్పు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా హైదరాబాదులో కీలకమైన జూబ్లీహిల్స్ మీద పట్టు సాధిస్తే నేషనల్ వైడ్ గా తెలంగాణ కాంగ్రెస్ కు మంచి ఇమేజ్ పెరుగుతుంది. ప్రజల్లో తమకు వ్యతిరేకత లేదని తేల్చి చెప్పుకోవచ్చు.
అటు బిఆర్ ఎస్ కు కూడా కవిత బయటకు వెళ్లి నానా హంగామా చేస్తున్న నేపథ్యంలో తమ ఓటు బ్యాంకు ఏమాత్రం చెదరలేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. పైగా సిట్టింగ్ స్థానం కాబట్టి దాన్ని కాపాడుకోవాలి. మళ్లీ గెలిచి ప్రజల్లో తమకు ఆదరణ పెరిగిందని నిరూపించుకోవాల్సిందే. ఓడిపోతే బిఆర్ఎస్ కు ఆదరణ తగ్గిందని ప్రతిపక్షాలు అటు అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తాయి. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీనే గెలుస్తుందని పదేపదే చెబుతున్న గులాబీ పార్టీకి ఈ ఎన్నిక ఎంతో ముఖ్యం. ఈ ఎన్నికలో గెలిస్తేనే ఆ పార్టీ నేతలు చెప్పే మాటలను ప్రజలు నమ్ముతారు. లేదంటే అంతే పరిస్థితి అవుతుంది.
అటు బిజెపికి ఇది పెద్ద సవాల్. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం వస్తుందని ఆ పార్టీ నేతలు పదేపదే ప్రచారం చేస్తున్నారు. పైగా తెలంగాణ బిజెపి పగ్గాలు రామచందర్రావు కు ఇచ్చిన తర్వాత పార్టీ హవా తగ్గలేదు అని నిరూపించుకునేందుకు ఇదే పెద్ద ఛాన్స్. అంతేకాకుండా రాజాసింగ్ వెళ్లిపోయిన తర్వాత హైదరాబాదులో తమ ఓటు బ్యాంకు తగ్గలేదని నిరూపించుకోవాల్సి వస్తుంది. ఇంకోవైపు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ జూబ్లీహిల్స్ ఉంది. అంటే ఇది ఆయన సొంత సెగ్మెంట్. కాబట్టి ఇక్కడ ఓడిపోతే ఆయన ఇమేజ్ దెబ్బ తినడం ఖాయం. అందుకే ఈ మూడు పార్టీలకు ఇక్కడ గెలవడం ఇప్పుడు కీలకమైంది. మెయిన్ ఎగ్జామ్ కు ముందు ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసినట్టు ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక రాబోయే సాధారణ ఎన్నికలకు ప్రతీకగా మారింది. మరి ఇందులో ఎవరు గెలుస్తారు ఎవరి పట్టు నెగ్గుతుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com