TG : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నోడల్ అధికారుల నియామకం

TG : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నోడల్ అధికారుల నియామకం
X

జూబ్లీహిల్స్ శాసనసభా స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణ దిశగా ఎన్నికల అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎన్నికల సంస్థ ఓటర్ జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్న్నూ వచ్చేనెల 2వ తారీఖు నుంచి మొదలు పెట్టనుంది. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా నోడల్ అధికారులను నియమిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ R.V. కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ అధికారులు, సిబ్బంది సమీకరణ, ఈవీఎంలు, వీవీ ప్యాట్ ల పరిశీలన, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, రవాణా సదుపాయాలు, అవసరమైన సామగ్రి సమకూర్చడం వంటి బాధ్యతలను నోడల్ అధికారులకు అప్పగించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో జూన్ 8న మృతి చెందారు. అప్పటి నుంచి శా సనసభా స్థానం ఖాళీగా ఉంది.

Tags

Next Story