BRS : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్ ఎస్ మాస్టర్ ప్లాన్

BRS : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్ ఎస్ మాస్టర్ ప్లాన్
X

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ ఎస్ బలంగా ఫోకస్ పెడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలిచి తీరాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ దగ్గరుండి ఈ ఎన్నికలను పరిశీలిస్తున్నారు. మొన్ననే ఈ నియోజకవర్గ ఇన్ చార్జులతో కేసీఆర్ మీటింగ్ నిర్వహించారు. ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనేది దిశా నిర్దేశం చేశారు. ఈ ఎన్నికలను బీఆర్ ఎస్ అత్యంత కీలకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కంటోన్మెంట్ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే గ్రేటర్ లో కారుపై రకరకాల ప్రచారం జరిగింది. అసలే తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్. అందులో ఉన్న పట్టు చేజారిపోవద్దని చూస్తోంది బీఆర్ ఎస్.

పైగా ఈ ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన సీట్లు సాధించాలని కేసీఆర్ భావిస్తున్నారంట. జూబ్లీహిల్స్ లో గెలిస్తే తమ పట్టు నిలబడుతుంది. పైగా ఇది సిట్టింగ్ స్థానం. కాబట్టి ఇక్కడ గెలిచి కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగిందని ప్రచారం చేసుకోవచ్చన్నది గులాబీ బాస్ ప్లాన్. అలాగే బీఆర్ ఎస్ కు తిరుగులేదని.. ప్రజలంతా తమవైపే ఉన్నారని ప్రచారం చేసుకుని స్థానిక ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని ప్లాన్ వేస్తున్నారంట. అప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగిందనే ప్రచారం ప్రజల్లో పెరిగిపోతుంది. అది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా పనిచేస్తుందని గులాబీ బాస్ అంచనా వేస్తున్నారంట.

రాబోయే ఎన్నికలకు ఈ జూబ్లీహిల్స్ కీలకంగా ఉండటంతో.. దీనికి కేసీఆర్ దగ్గరుండి వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ ఒక ఉప ఎన్నికకు దగ్గరుండి ప్లాన్లు ఇస్తున్నారు. ఏ వర్గంను ఎలా ఆకట్టుకోవాలి, జూబ్లీహిల్స్ లో ఏ ప్రాంతం ఓట్లను ఎలా ఆకర్షించాలి అనేది కేటీఆర్, హరీష్‌ రావుకు వివరిస్తున్నారంట. తన ప్లాన్లను అమలు చేసే బాధ్యత కేటీఆర్, హరీష్‌ రావు మీద పెట్టినట్టు తెలుస్తోంది. అటు కాంగ్రెస్, బీజేపీలు కూడా బలంగానే దిగుతున్నాయి కాబట్టి సిట్టింగ్ సీటు పోతే ప్రజల్లో బీఆర్ ఎస్ మీద టాక్ మారుతుందనే టెన్షన్ గులాబీ బాస్ కు ఉంది. మరి కేసీఆర్ ఎలాంటి వ్యూహాలను అమలు చేయిస్తారో చూడాలి.

Tags

Next Story