Telangana Nesws : ముగిసిన జూబ్లీహిల్స్ ప్రచారం.. గెలుపెవరిదో..?

Telangana Nesws : ముగిసిన జూబ్లీహిల్స్ ప్రచారం.. గెలుపెవరిదో..?
X

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఇన్ని రోజులు గల్లీగల్లీలో మోతమోగిన మైకులు మూతబడ్డాయి. ఎక్కడి వారు అక్కడే సైలెంట్ అయ్యారు. ఇన్ని రోజులు నేతల ప్రసంగాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉర్రూతలూగిన జూబ్లీహిల్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. ఇక ప్రలోభాల పర్వానికి పార్టీల తెరతీయబోతున్నాయి. ఈ ఉప ఎన్నికను మూడు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకే అన్ని పార్టీల కీలక నేతలు అందరూ ఇక్కడే మకాం వేశారు. వేరే పనులన్నీ పక్కన పెట్టేసి మొదట నుంచి చివరి దాకా ఇక్కడే ప్రచారం చేశారు. ప్రతి గల్లీ తిరిగారు. ప్రతి ఓటర్ ను టచ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తమకే ఓట్లు రావాలని విశ్వ ప్రయత్నాలు చేశారు.

అపోజిట్ గా ఉంటున్న గల్లీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వారికి కీలక హామీలను ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హామీలను కురిపించింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ ను తమ పార్టీ గతంలో అభివృద్ధి చేసిన తీరును.. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న హామీల గురించి స్పెషల్ గా వివరించారు. బీఆర్ ఎస్ నుంచి కేటీఆర్ ప్రచార బాధ్యతను భుజాన వేసుకుని ప్రచారం చేశాడు. హైడ్రా కూల్చివేతలు, కాంగ్రెస్ హామీలు పూర్తిగా అమలు చేయకపోవడం లాంటివి ప్రధానంగా చూపిస్తూనే.. నవీన్ యాదవ్ రౌడీషీటర్ అంటూ ప్రచారం చేసి ఓట్లు అడిగారు. అటు బీజేపీ కూడా కాంగ్రెస్, బీఆర్ ఎస్ లు ఇన్ని రోజులు ఏం డెవలప్ చేయలేదని.. తమకు ఓటేస్తే అన్ని రకాల అభివృద్ధి చేస్తామంటూ హామీ ఇచ్చారు ఆ పార్టీ నేతలు.

ఇలా ఇన్ని రోజులు జూబ్లీహిల్స్ మొత్తం వేడెక్కిపోయింది. నవంబర్ 11న పోలింగ్ ఉంది. 14న ఎన్నికలు రాబోతున్నాయి. ఇందులో ఎవరు గెలవబోతున్నారు.. ఎవరు జెండా ఎగరేయబోతున్నారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ. ఏ పార్టీ గెలిచినా ఆ ఫలితం ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. బీఆర్ ఎస్ గెలిస్తే తమకు ప్రజల మద్దతు పెరిగిందని అంటుంది. కాంగ్రెస్ గెలిస్తే తమమీద వ్యతిరేకత లేదు అంటుంది. బీజేపీ గెలిస్తే రాబోయేది తమ ప్రభుత్వమే అంటుంది. ఇలా ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా ఈ ఎన్నికల ఫలితం రాబోయే స్థానిక ఎన్నికలు.. ఆ తర్వాత వచ్చే గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలపై బలమైన ప్రభావం చూపుతుంది.

Tags

Next Story