Jurala : జూరాల 45 గేట్లు ఓపెన్.. శ్రీశైలానికి ఉగ్ర కృష్ణమ్మ

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. జూరాలకు 45 గేట్లు ఎత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు శ్రీశైలం 10 గేట్లు 10 అడుగుల మేరపైకి ఎత్తి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884.90 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు, ప్రస్తుతం 214.364 టీఎంసీలకు చేరింది.
మరోవైపు సోమశిల జలాశయం రక్షణ పనుల్లో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సోమశిల జలాశయంలో జరుగుతున్న ఆఫ్రాన్ నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. గత నాలుగేళ్లుగా సోమశిల భద్రత విషయమై గత ప్రభుత్వంతో ఏకధాటిగా పోరాటం చేశానని, అయినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గత ప్రభుత్వం 97 కోట్లు అభివృద్ధి పనులకు విడుదల చేసినా కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయని చెప్పారు. ఇంకా సుమారు 75 కోట్ల మేర పనులు చేయాల్సి ఉందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సోమశిల భద్రతపై దృష్టి పెట్టిందని, స్వయంగా ముఖ్యమంత్రే సోమశిల జలాశయాన్ని సందర్శించి పనులు మొదలు పెట్టాలని ఆదేశాలిచ్చినట్లు చెప్పారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com