TS: ఒక్కరోజు ప్రధాన న్యాయమూర్తిగా..జస్టిస్‌ పొనుగోటి నవీన్‌రావు

TS: ఒక్కరోజు ప్రధాన న్యాయమూర్తిగా..జస్టిస్‌ పొనుగోటి నవీన్‌రావు
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ పొనుగోటి నవీన్‌రావు ఇవాళ ఒక్కరోజు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ పొనుగోటి నవీన్‌రావు ఇవాళ ఒక్కరోజు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇప్పటివరకూ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడంతో ఆ బాధ్యతలను తాత్కాలికంగా అత్యంత సీనియర్‌ జడ్జి అయిన జస్టిస్‌ నవీన్‌కు అప్పగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. అయితే జస్టిస్‌ నవీన్‌రావు నేడు పదవీ విరమణ చేయనుండటంతో ఆయన ఈ ఒక్కరోజే పదవిలో కొనసాగుతారు. మరుసటి రోజు నుంచి సీనియారిటీలో ముందు వరుసలో ఉన్న జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తారని కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే పేరును సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 5న కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆయన నియామకానికి రాష్ట్రపతి ఇంకా ఆమోదముద్ర వేయాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story