Telangana High Court CJ : హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ సుజయ్ పాల్

Telangana High Court CJ : హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ సుజయ్ పాల్
X

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌ నియమితులయ్యారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్‌పాల్‌కు సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే బాంబే హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు.

1964 జూన్‌ 21న జన్మించిన జస్టిస్‌ సుజయ్‌పాల్‌ బీకాం, ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి 1990లో మధ్యప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్‌, బోర్డులకు సేవలు అందించారు. ఆయన 2011 మే 27న మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేశారు. 2014 ఏప్రిల్‌ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుతో 2024 మార్చి 21న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తాజాగా ఆయన హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.

Tags

Next Story