KA Paul : నన్ను చంపుతామని బెదిరిస్తున్నరు : కేఏ పాల్

KA Paul : నన్ను చంపుతామని బెదిరిస్తున్నరు : కేఏ పాల్
X

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేస్తామని ఫోన్‌ చేసి మరీ బెదిరిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలపై తాను కేసులు వేశానని పేర్కొన్నారు. తాను వేసిన కేసులను విత్‌డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు తనను చంపుతామని బెదిరించారని కేఏ పాల్‌ తెలిపారు. అప్పుడు తనకు ఏమీ కాలేదని.. తనను బెదిరించిన వాళ్లే పోయారని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా తనకు ఏమీ కాదని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఉన్న సెక్యూరిటీని కూడా తొలగించుకున్నానని చెప్పారు. ఇకపై తనకు దేవుడే రక్ష అని తెలిపారు. తనపై కుట్ర పన్నిన వారు కలలో కూడా బాగుపడరని అన్నారు. తనను చంపాలని కుట్ర చేస్తున్నవారు కచ్చితంగా చనిపోతారని శపించారు.

Tags

Next Story