HYDRA : హైడ్రా కూల్చివేతలపై కేఏ పాల్ సంచలన కామెంట్స్

HYDRA : హైడ్రా కూల్చివేతలపై కేఏ పాల్ సంచలన కామెంట్స్
X

మంచినీటి సరస్సులు, చెరువులను రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కూల్చివేతలను పారదర్శకంగా కొనసాగించాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చిన తరహాలోనే ఎంతటి వారినైనా వదలకుండా జరపాలని అన్నారు.

తన పర బేధం లేకుండా చెరువులను రక్షించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతున్న ముగ్గురు మంత్రులు కూడా.. ఎన్ కన్వెన్షన్ తరహాలోనే చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని.. వారివి కూడా కూల్చివేయాలని డిమాండ్ చేశారు.

Tags

Next Story