KA Paul : గ్రూప్1 అభ్యర్థులకు టైం ఇస్తే తప్పేంటి : కేఏ పాల్

తెలంగాణ లో పది మంది ఎమ్మె ల్యేలపై కేసు వేస్తే, కేసులను విత్ డ్రా చేసుకోవా లని.. లేదంటే సంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. ప్రజలకు మంచి చేయాలని మాత్రమే వచ్చానని తెలిపారు. 'నన్ను చంపు తామని గతంలో బెదిరించిన వాల్లే పోయారు. సంపాలని నా మీద కుట్రలు చేస్తున్నారు.. నాకు ఉన్న సెక్యూరిటీని కూడా తొలగించుకున్న. నాకు దేవుడే సెక్యూరిటీ. గ్రూప్ 1 స్టూడెంట్స్ సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. వాళ్లకు నెల, రెండు నెలలు టైం ఇస్తే తప్పేంటి. తెలంగాణ, కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభు త్వాలు అమలు చేయలేదు. అందుకే కాంగ్రెస్ హామీలను హర్యానాలో జనం నమ్మలేదు. డిల్లీ లిక్కర్ స్కాం లా ఏపి లో లిక్కర్ స్కాం జరు గుతోంది. ఏపీ మంత్రులు, మాజీ మంత్రులు నేరుగా లిక్కర్ దందాలో వాటాల అడుగు తున్నారు. వాళ్లపై చర్యలు తీసుకోవాలి. నేను రేవంత్ రెడ్డి తో ఉంటే రాష్ట్ర అభివృ ద్దికి మంచి జరుగు తుంది. చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లేదు. బాబు రావాలి జాబు రావాలి అన్నారు నేను అప్పుడే చెప్పాను బాబు వస్తే ఏది జరగదు అని. లడ్డూ కల్తీనే జరుగలేదు. ప్రపంచంలో డబ్బు ఎక్కువైంది మనకు దరిద్రం ఎక్కువైంది. ప్ర పంచంలో వీళ్ల ముఖాలు చూసి ఒక్క రూపాయి ఎవరు ఇవ్వడం లేదు. ప్రపంచంలో చైనా వద్దు ఇండియా ముద్దంటున్నారు. ఏపీలో డ్రగ్స్ ప్రొ డక్షన్ జరుగుతుంది . దేశమంతా డ్రగ్స్ సప్లై అవుతుంది . సౌత్ కొరియా వెళ్లి టూరిస్ట్ గా తిరిగి వచ్చాడు రేవంత్ రెడ్డి. మంత్రి కొండా సురేఖ సీఐ కుర్చీలో కూర్చుంటారా. లా ఎక్కడ ఉంది.. ఎందుకు చర్యలు తీసుకోరు. ఈ వీఎం లు వద్దు.. బ్యాలెట్ కావాలి. సుప్రీం కోర్టులో పిల్ వేయబోతున్నా. ఈవిఎంలను ట్యాంపర్ చేస్తా రని చంద్రబాబు అపుడు అన్నాడు. ఇపుడు జగన్ అంటున్నాడు' అని కేఏ పాల్అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com