టీఆర్‌ఎస్‌లో చేరిన కడారి అంజయ్య యాదవ్.. !

నాగార్జున సాగర్ నియోజకవర్గ బీజేపీ నేత కడారి అంజయ్య యాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, రవీంద్ర కుమార్‌తో పాటు పలువురు నల్గొండ జిల్లా నేతలు పాల్గొన్నారు.
సాగర్ బీజేపీ టికెట్ డాక్టర్ పానుగోతు రవికుమార్‌కు ఇవ్వడంతో.. బీజేపీలో అసంతృప్తుల సెగ తగిలింది. చివరివరకు టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డ బీజేపీ నేత కడారి అంజయ్య యాదవ్ పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు. బైపోల్ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన.. ముందు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించారు. ఐతే ఇంతలోనే జిల్లా TRS ఎమ్మెల్యేలు ఆయనతో చర్చలు జరిపారు.
పైళ్ల శేఖర్‌రెడ్డి, రవీంద్రకుమార్ నాయక్, సైదిరెడ్డి ముగ్గురితో మాట్లాడాక అంజయ్య యాదవ్ గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధపడ్డారు. ఆయనకు CM కేసీఆర్ అపాయింట్‌మెంట్ కూడా ఖరారైంది. ఉప ఎన్నికల వేళ ఈ పరిణామం బీజేపీకి షాక్‌లా మారిందనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com