TG : ఇంజినీర్లపై కాళేశ్వరం కమిషన్ చైర్మన్ అసహనం

అసందర్భమైన, పొంతనలేని సమా ధానాలు చెప్పొద్దని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ అసహనం వ్యక్తం చేశారు. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమా ధానం చెప్పాలని స్పష్టం చేశారు. విచార ణలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పనిచేసిన పలువురు డీఈలు, ఏఈలు కమిషన్ ఎదుట హాజరయ్యారు. కాగా నిర్మాణం, పనుల వివరాలపై కమిషన్ ఆరా తీసింది. మేడిగడ్డ బ్లాక్ -7తో పాటు 3 బ్యారేజీల వర్క్ ప్లేస్మెంట్ల రిజిస్టర్లను స్వాధీనం చేసుకుంది. ఫీల్డ్ జరిగిన పనులకు సంబంధించి రిజిస్టర్లలో ఇంజినీర్ల సంతకాలతోపాటు కుంగిన పిల్లర్లకు సం బంధించిన బ్లాక్ -7 రిజిస్టర్లపై సంతకాలు తీసుకుంది. దాదాపు 18 మంది ఇంజినీ ర్లను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మిస్ అయినట్లు కమిషన్ గుర్తిం చింది. కాగా తొలి డ్యామేజీ 2020లోనే జరిగినట్లు గుర్తించి లేఖలు రాసినట్లు కమిషను ఇంజినీర్లు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com