Telangana Government : కాళేశ్వరం కమిషన్ గడువు ఏప్రిల్ 30 వరకు పొడగింపు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పినాకీ చంద్రఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ గడువు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కాళేశ్వరం ఎత్తిపోతల పతాకంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను మరోసారి పొడగించింది సర్కార్. జస్టిస్ పీసీ ఘోష్ ఈనెల 23న తెలంగాణకు రానున్న నేపథ్యంలో కమిషన్ గడువు ఏప్రిల్ 30 వరకు పెంచుతూ తెలంగాణ నీటి పారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దఫా మిగిలిన విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయనున్నట్టు సమాచారం. కాగా తదుపరి జరగనున్న విచారణలో సీనియర్ ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లతో సహా.. గత ప్రభుత్వంలోని కొంతమంది బడా నాయకులను కూడా పిలవనున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప ఎడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించగా.. అందులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com