TG : ఎల్లుండి నుంచే కాళేశ్వరం విచారణ.. కేసీఆర్, హరీశ్ సహా 52మందికి నోటీసులు

TG : ఎల్లుండి నుంచే కాళేశ్వరం విచారణ.. కేసీఆర్, హరీశ్ సహా 52మందికి నోటీసులు
X

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ పట్టుబిగించింది. దశలవారిగా విచారణ చేస్తున్న జస్టిస్ డిసెంబర్ చివరినాటికి నివేదిక ఇచ్చేందుకు విచారణలో వేగం పెంచింది. తొలివిడతగా ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థలు, అర్థిక సంస్థల ప్రతినిధులను

కౌంటర్ విచారణ జరపనుంది. సోమవారం నుంచి నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రతినిధులతో పాటుగా కాగ్ అధికారులను విచారించేందుకు కమిషన్ రంగం సిద్ధం చేసింది. డిసెంబర్ 5లోగా 52 మందిని విచారించి అనంతరం ఐఏఎస్ అధికారులను విచిరించేందుకు కమిషన్ నిర్ణయించినట్లు తెలిసింది. విచారణలో చివరి భాగంగా ఆనాటి ప్రజా ప్రతినిధులకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రజా ప్రతినిధులకు 15 రోజుల ముందుగానే నిబంధనలమేరకు నోటీసులు జారీ చేసే అంశంపై జస్టిస్ అధికారులతో సమీక్షించినట్లు సమాచారం.

Tags

Next Story