Telangana : సీఎం రేవంత్‌కు కాళేశ్వరం నివేదిక.. నెక్ట్స్ ఏంటీ..?

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కోసం నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో సీఎంకు అందజేశారు. కమిషన్ నివేదికను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.
ఈ కమిటీ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేస్తుంది. నీటి పారుదల శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేయగా, ఈ కమిటీ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ఈ నెల 4న రాష్ట్ర మంత్రిమండలికి సమర్పించనుంది. అదేవిధంగా మంత్రులు, సీఎస్ తో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. కమిషన్ నివేదికపై చర్చించారు. నివేదికపై ఏ విధంగా ముందకెళ్లాలన్నదానిపై సమాలోచనలు జరిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com