TG : కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రసాభాస

సికింద్రాబాద్ అడ్డగుట్టలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. లభ్దిదారులకు చెక్కులను ఇచ్చే క్రమంలో ఇరు పార్టీల నేతలు పోటా పోటీగా నినాదాలు చేశారు. అక్కడే వున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికలవేళ చేతగాని హామీలు ఇచ్చి, తెలంగాణ ప్రజలను నయవంచన చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇప్పటివరకు ఇవ్వటంలేదని అన్నారు. గ్రేటర్ పరిధిలో ఒక ఎమ్మెల్యే, కార్పొరేటర్ గెలవలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు, తమ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పులకు భయపడేవారు లేరని అన్నారు. 20 సంవత్సరాలుగా ఉద్యమం నేపథ్యం ఉన్న కార్యకర్తలు తమ పార్టీలో వున్నారని పద్మారావు అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com