MP Chamal : కవితది దొంగ దీక్ష.. ఎంపీ చామల విమర్శలు

ఎమ్మెల్సీ కవిత దొంగ దీక్షలు చేస్తున్నారని పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆమెకు పూలే విగ్రహం పెట్టాలని గుర్తుకు రాలేదా? అని ఎంపీ చామల నిలదీశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కేటీఆర్ బ్యాచే నెగిటివ్ పాలిటిక్స్ చేశారని సెటైర్ వేశారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ చేయడం రాంగ్ అంటారా ఫైర్అయ్యారు. గాంధీ భవన్ లో చామల మీడియాతో మాట్లాడుతూ 'ఎమ్మెల్సీ కవితకు గుర్తింపు సమస్య వచ్చింది. వార్తల్లో ఉండేందుకు ఏదో అంశాన్ని పట్టుకుని రాజకీయం చేస్తున్నరు. ఇవాళ ఆమె ధర్నా చేస్తుంటే నవ్వొస్తుంది. బీసీల పట్ల కాంగ్రెస్ కు చిత్త శుద్ధి ఉంది. అందుకే ఢిల్లీలో రిజర్వేషన్ పై ధర్నా చేశాం. కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నం. బావ, బామ్మర్దులు పోటీ పడి సంబంధం లేని విషయాల్లో ట్వీట్లు చేస్తున్నరు. కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో బయటికి రారు.. మీరుబయటుండి నెగిటివ్ నే ప్రచారం చేస్తారు. ఏఐతో లేని బొమ్మలను క్రియేట్ చేసి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ను బద్నాం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వం కోర్టులో కేసు వేయగానే కిషన్ రెడ్డి హెచ్సీయూ మీద పెట్టిన పోస్ట్ లు డిలీట్ చేశారు. ప్రజలను రెచ్చగొట్టడానికి లేనివి ఉన్నవిగా చూపి స్తున్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఒకటేనని బండి సంజయ్ అంటుండు. డీలిమిటేషన్ కోసం చెన్నై పోతే ఒక్కటైనట్లేనా?' అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com