MLC Kavitha : ఎమ్మెల్సీ ఫలితాలపై కవిత ఆసక్తికర స్పందన

MLC Kavitha : ఎమ్మెల్సీ ఫలితాలపై కవిత ఆసక్తికర స్పందన
X

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయి..ప్రజాస్వామ్యం ఒడిపోయిందన్నారు ఎమ్మెల్సీ కవిత. పార్టీలపరంగా, సిద్ధాంతాల పరంగా ఓట్లు చీలాయని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలో బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపారని విమర్శించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లపై మూడు బిల్లులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల పెంపునకు వేర్వేరు బిల్లులు పెట్టాలని..విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉంటుందన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశం కేవలం రాష్ట్రం పరిధిలో ఉంటుందన్నారు కవిత.

Tags

Next Story