Kavitha : బీసీ రిజర్వేషన్ల అంశంపై కవిత ఆగ్రహం...కులగణన సర్వే వివరాలు వెల్లడించాలని డిమాండ్...

Kavitha : బీసీ రిజర్వేషన్ల అంశంపై కవిత ఆగ్రహం...కులగణన సర్వే వివరాలు వెల్లడించాలని డిమాండ్...
X

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం త్వరలో జీవో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కులగణన సర్వే వివరాలు బయటపెట్టకుండా రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఉందని ఆమె ఆరోపించారు.

ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన కవిత... కులగణన సర్వే వివరాలు వెల్లడించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలో భాగమని అన్నారు. తమకు అనుకూలంగా ఉన్న చోట రిజర్వేషన్లు ఖరారు చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని.. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ప్రకటించేలోపే కులగణన సర్వే వివరాలు వెల్లడించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ జాగృతి మొదటి నుంచి చిత్తశుద్ధితో పోరాడుతోందని, రిజర్వేషన్ల పెంపు సాధించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు.

కాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై జిల్లా స్థాయి అధికారులు కసరత్తు పూర్తి చేశారని, అయితే రిజర్వేషన్ల విషయం ఎక్కడా బయటపెట్టవద్దని కలెక్టర్లు అధికారులకు కఠిన హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఈ రాజకీయ ఆరోపణలు, డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Tags

Next Story