BJP Leader Eleti : కవిత బీఆర్ఎస్ ను వీడడం ఖాయం : ఏలేటి

రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా దోచుకున్న అవినీతి సొమ్మును పంచుకునే క్రమంలో తలెత్తిన వాటాల సమస్యలో బాగంగానే ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ కు తాజాగా లేఖ రాసిందని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. కవిత వీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లనుందని, ఆమె రాసిన లేఖ బయటకు రానుందని వారం క్రితం తను చిట్ చాట్ లో స్పష్టం చేసానని గుర్తు చేశారు. తండ్రి కేసీఆర్కు కవిత రాసిన లేఖ బయ టకు వస్తుందని కూడా తాను ముందే చెప్పానని స్పష్టం చేశారు. అవినీతి సొమ్ముతో పాటు పాటు పదవులు కూడా అన్న కేటీఆర్ కే ఇస్తారా అని లేఖలో కవిత కేసీఆర్ను ప్రశ్నించారని పేర్కొన్నారు. ఈ మేరకు కవిత లేఖ పై గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీ ఆర్ఎస్ నాలుగు స్తంభాల ఆట సాగుటుతోందని, తాజగా కవిత రూపంలో ఓ స్థంభం బయటకు వచ్చిందన్నారు. బీఆర్ఎస్ అధికా రం లోకి రావడానికి తన నేతృత్వంలోని జాగృతి సంస్థ కూడా కృషి చేసిందని, అయిన తండ్రి కేసీఆర్ పార్టీలో తనకు సముచిత స్థానం ఇవ్వడం లేదని కవిత ఆవేదన లేఖలో స్పష్టం అయిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com