Kavitha : మరో ఉద్యమానికి కవిత రెడీ.. అందుకే దూకుడు

Kavitha : మరో ఉద్యమానికి కవిత రెడీ.. అందుకే దూకుడు
X

జైలు నుంచి వచ్చాక కార్యాచరణ స్పీడు పెంచారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్‌ చేశారు. గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేసిన బయ్యారం సాధ్యంకాదన్న ప్రకటనపై ఆమె ఫైరయ్యారు. విభజన హామీలోని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో కేసీఆర్‌ ఎన్నోసార్లు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారన్నారు. కేంద్రం అభ్యంతరాలకు తగిన సమాధానాలు కూడా ఇచ్చారన్నారు. బీజేపీ తలచుకుంటే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యమన్నారు. నిన్న పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానం చాలా దారుణమన్నారు. తెలంగాణ నుంచి 8మంది బీజేపీ ఎంపీలు గెలిచినా ఈ విషయంలో ఒక్క మాట మట్లాడకపోవడం విచారకరమన్నారు.

Tags

Next Story