TG : కవిత ఫేస్ లా తెలంగాణ తల్లి : మంత్రి కొండా సురేఖ

TG : కవిత ఫేస్ లా తెలంగాణ తల్లి : మంత్రి కొండా సురేఖ
X

మంత్రి కొండా సురేఖ మరోసారి కీలక కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కవిత ఫేస్ లాగా తయారు చేశారని, అందుకే నమూనాను మార్చామంటూ సంచలన కామెంట్స్ చేశారు. మాజీమంత్రి కేటీఆర్ కు కామన్ సెన్స్ లేదని, బీఆర్ఎస్ పార్టీకి అధికారం లేకపోయే సరికి తట్టుకోలేకపోతున్నారని ఫైర్అయ్యారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సురేఖ మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీకి రాని నాయకుడు ప్రతిపక్షనేత ఎలా అవుతారని, మాజీసీఎం కేసీఆర్ ఫామ్హహౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. కేటీఆర్ భాష దారుణంగా ఉందని.. ఆయన కంటే.. కేసీఆర్ బెటర్ మాట్లాడుతారని చెప్పారు. కోమ టిరెడ్డి బ్రదర్స్ గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే అర్హత లేదన్న సురేఖ .. రాష్ట్రం కోసం రాజీనామా చేసిన చరిత్ర వారిదని చెప్పుకొచ్చారు. తాము ఎప్పుడూ కక్షపూరిత రాజకీయాలు చేయలేదన్నారు మంత్రి కొండా సురేఖ. రేవంత్ రెడ్డిని అరెస్టు చేసినట్టు తాము అరెస్టు చేయాలనుకుంటే బీఆర్ఎస్ నేతలంతా జైల్లో ఉండేవాళ్లని తెలిపారు.

ఇక హుజూరాబాద్ ఎమ్మెల్యే పిచ్చోడు. అసెంబ్లీ వాతావ రణం చెడగొట్టిన సాంస్కృతి ఆయనది విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు చెబుతున్న.. సలహాలు, సూచనలు చేయండి అంతే కానీ అర్థంపర్థం లేని విమర్శలు ఎందుకని ఆమె ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ నేతల హస్తం లేకపోతే ఆఫీసర్లను దేశం ఎందుకు దాటించారని సురేఖ ప్రశ్నిచారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తల్లి బొమ్మని దొరసానిలాగా తయారు చేశారని. బంగారు ఆభరణాలు, వడ్డానాలు పెట్టారంటూ వివాదాస్పదాలు చేశారు. గతంలో కవిత ఫేస్ లాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. మేం మన తెలంగాణ ప్రజల ఆత్మని ఆవిష్కరిస్తున్నమని తెలిపారు.

Tags

Next Story