TG : ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాలు.. బతుకమ్మతోనే కవిత కొత్త ఉద్యమం

TG : ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాలు.. బతుకమ్మతోనే కవిత కొత్త ఉద్యమం
X

తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్లు, ఆదేశాలను ధిక్కరించి జగిత్యాల పట్టణంలో ఉద్యమ తెలంగాణ తల్లి ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ లో ఉద్యమం నాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి భూమి పూజ నిర్వహించారు. ఆదివారం ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ కార్యకర్తలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని జీవోలు, గెజిట్ లు జారీ చేసినా ఉద్యమ తెలంగాణ తల్లినే తాము ప్రతిష్టించుకుంటామని తేల్చిచెప్పారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉద్యమకాలంలో తెలంగాణ తల్లి తమకు స్పూర్తిని ఇచ్చిందని, ధైర్యాన్ని నింపిందని తెలియజేశారు. ఉద్యమ తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మను కాపాడుకొని విశ్వమంతా వ్యాపింపజేస్తామని తెలిపారు. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదాడిని గ్రామ గ్రామాన ఎండగడుతామని అన్నారు. గ్రామ గ్రామాన ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్టిస్తామని చెప్పారు.

Tags

Next Story