MP Raghunandan Rao : కవిత పార్టీ పెట్టడం ఖాయం : రఘునందన్

మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు మరోసారి సంచలన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీని ప్రకటించబోతున్నారని రఘునందన్ రావు జోస్యం చెప్పారు. ఈక్రమంలో మంగళవారం తుప్రాన్లో పర్యటించిన ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ జరుగుతున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితతో కేసీఆరే కొత్త పార్టీ పెట్టిస్తున్నా రని, తండ్రీ, కూతుళ్ల రాజకీయ రాయబారం చేసేందుకు మధ్యవర్తులెందుకని విమర్శించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల మాదిరిగా కవిత రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తారన్నారు రఘునందన్. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయన్న కవిత పదేళ్ల పాటు ఎలా ఉన్నారని రఘునందన్ రావు ప్రశ్నించారు. ముఖ్యంగా పదేళ్లుగా దెయ్యాల మధ్య రాజకీయం ఎందుకు చేయాల్సి వచ్చిందన్నారు. ఎన్నికలలో గెలిచినప్పుడు దేవుడయ్యాడని, ఇప్పుడు దెయ్యం ఎందుకయ్యాడో కవిత చెప్పాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com