TG : చాన్నాళ్లకు కవిత రియాక్షన్.. అదానీ కేసులో ఏమన్నారంటే..

TG : చాన్నాళ్లకు కవిత రియాక్షన్.. అదానీ కేసులో ఏమన్నారంటే..
X

లిక్కర్ స్కాంలో అరెస్టు అయ్యి జైలు నుంచి విడుదలైన తర్వాత సైలెంట్ అయిపోయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చాలా రోజుల తర్వాత తొలిసారి స్పందించారు. అదానీ వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అఖండ భారతంలో అదానికో న్యాయం... ఆడబిడ్డకో న్యాయమా అంటూ ట్వీట్ చేశారు. అధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి తనను అరెస్టు చేశారనీ.. ఆధారాలు ఉన్నా అదానీని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా అని కవిత ప్రశ్నలు వర్షం కురిపించారు. ఈ పోస్ట్ ను బీఆర్ఎస్ వర్గాలు వైరల్ చేస్తున్నాయి.

Tags

Next Story