Kavitha : చరిత్ర మలుపుతిప్పిన రోజిది.. కవిత పోస్ట్
తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు ఈరోజు అంటూ ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 2009 నవంబర్ 29 చాలా ముఖ్యమైన రోజన్నారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు.. కేసీఆర్ తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేందుకు సిద్ధమైన రోజని, తెలంగాణ జైత్రయాత్ర లేదా కేసీఆర్ శవయాత్ర.. తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో అనే సంకల్పంతో దీక్ష ప్రారంభించిన రోజని కవిత గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో చారిత్రాత్మక రోజైన నవంబర్ 29న తెలంగాణ జాతిపిత, ఉద్యమ నేత కేసీఆర్ పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ యావత్ ప్రజానీకాన్ని జాగృతం చేస్తూ.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే 'దీక్షా దివస్' లో పెద్ద ఎత్తున పాల్గొందామని కవిత పిలుపు నిచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com