MLC Kavitha : కవిత నోట సామాజిక తెలంగాణ మాట.. హాట్ టాపిక్

సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సిన అవశ్యకత ఏర్పడిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. అసమానతలు లేని తెలంగాణ నిర్మాణంకోసం కార్మికులంతా సంఘటిత ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆవిర్భవించిన భౌగోళిక తెలంగాణను అసమానతలు లేని తెలంగాణగా తీర్చి దిద్దే బాధ్యతను ప్రజలు, ఉద్యమకారులు విస్మరించవద్దని చెప్పారు. సాధించిన తెలంగాణలో బీఆర్ఎస్ ఎంతో భివృద్ధి చేసినప్పటికీ చేయాల్సిన అభివృద్ధి ఉందన్నారు పాశ్యాత్యా దేశాల్లో కార్ఖానాల్లో నలిగిపోయిన కార్మికులు సంఘటిత ఉద్యమాలు చేసి సాధించిన హక్కులను మేడే స్ఫూర్తిగా సాధించేందుకు ఉద్యమించాలని కవిత చెప్పారు.
ఆర్థిక అసమానతలు ప్రజల మధ్య అంతరాలను సృష్టిస్తోందని విచారం వ్యక్తం చేశారు కవిత. మేడే సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తననివాసంలో అసంఘటిత కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో కవిత మాట్లాడుతూ పోరాడి సాదించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పాలక వర్గాలు మారుస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. సాధించిన కార్మిక చట్టాలను అమలు చేసేంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరంతర ఉద్యమాలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. చట్టాలు ఉన్నప్పటికీ అనేక రూపాల్లో, పద్ధతుల్లో శ్రమ దోపిడి జరుగుతూనే ఉందని విచారం వ్యక్తం చేశారు. కవిత సామాజిక తెలంగాణ సాధన స్ఫూర్తితో, సొంత అజెండాతో ముందుకు సాగుతారని రాజకీయ శ్రేణుల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com