MLC Kavitha : కవిత ట్విట్టర్ హ్యాండిల్ చేంజ్

MLC Kavitha : కవిత ట్విట్టర్ హ్యాండిల్ చేంజ్
X

బీఆర్ఎస్ కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత తన ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా ఆ మార్పులు చేశారు. ఇంతకు ముందు ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అని పెట్టుకున్న కవిత ఇప్పుడు వాటిని తీసేశారు. కేవలం మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు అని పెట్టుకున్నారు. అంతకు బీఆర్ఎస్ లీడర్, ఎమ్మెల్సీ అని ఉండేది. ట్విట్టర్ అకౌంట్ లో బీఆర్ఎస్ లోగోను కూడా తీసేశారు. ఎడుమ వైపు ఉన్న కారు గుర్తును తొలగించారు. ఇటీవల కవిత మీడియా సమావేశంలో మాట్లాడా రు. కేసీఆర్ బద్నాం కావడానికి హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణా రెడ్డి కారణమన్నారు. హరీష్ రావు, సంతోష్ లు అవినీతి అనకొండలంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చుట్టూ అవినీతి అనకొండలు చేరి మరకలంటి స్తున్నారని అన్నారు. కేసీఆర్ పై సీబీఐ కేసుల దాకా వచ్చాక పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత? అని కూడా మాట్లాడారు. అన్నట్టుగానే ఇప్పుడు బీఆ ర్ఎస్ పేరు, లోగోను ట్విట్టర్ నుంచి తీసేశారు. ఈ వ్యాఖ్యల అనంతరం బీఆ ర్ఎస్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన కవిత పార్టీకి, నిజామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థల శాసన మండలి సభ్యత్వానికి రిజైన్ చేశారు. రాజీనామా లేఖలను తెలంగాణ భవన్ కు మండలికి పంపారు. అయితే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమె రా జీనామాను ఆమోదించాల్సి ఉంది. ఈ తరుణంలో ఎమ్మెల్సీ అని కూడా తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తొలగించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Tags

Next Story