CM Revanth Reddy : ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించారు: సీఎం రేవంత్

గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పును తమపై పెట్టి పోయిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ పాత్ర మరువలేనిదని తెలిపారు. దొడ్డి కొమురయ్య, సర్వాయ్ పాపన్న, జయశంకర్ సర్ వంటి వాళ్లు ఎప్పటికీ గుర్తుండిపోయే మహనీయులని అన్నారు.
తాటి చెట్టంత పెరిగినా ఆవకాయంత తెలివితేటలు హరీశ్ రావుకు లేవని సీఎం రేవంత్ విమర్శించారు. నాగార్జున సాగర్, SRSP వంటి ప్రాజెక్టులు ఎవరు కట్టారని ప్రశ్నించారు. జూరాల, దేవాదుల, ఎల్లంపల్లి కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టించిందని చెప్పారు. తమ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులే నేడు తెలంగాణకి నీటిని అందిస్తున్నాయన్నారు. ప్రాజెక్టులపై పిల్లకాకులు కాకుండా అసలైన వ్యక్తి(కేసీఆర్ )ని చర్చకు రమ్మనాలని హరీశ్‌కు సవాల్ చేశారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com