KCR: టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చ..

KCR: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్.. విభజన హామీలతోపాటు రాష్ట్రానికి కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన, సాధించాల్సిన అంశాలపై ఎంపీలకు పలు సూచనలు చేశారు.
రాష్ట్ర హక్కులను సాధించుకొనేందుకు అనుసరించాల్సిన పోరాట పంథాపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయకుండా కేంద్రం నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తోందని.. ఈ అంశాలపై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాన్ని సీఎం కేసీఆర్ వివరించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో విద్యుత్తు చట్ట సవరణ బిల్లును తీసుకొస్తే ఎలా వ్యవహరించాలనే దానిపైనా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
మొత్తం 23 అంశాలపై పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించినట్లు టీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు.. తెలంగాణకు రావాల్సిన నిధులపై ఇప్పటికే సీఎం కేసీఆర్ కేంద్రానికి పలు లేఖలు రాశారన్నారు. బడ్జెట్‌లో వాటాకు సంబంధించిన అంశాలు ఏముంటాయో, ఏమి ఉండవో చూసిన తర్వాత మాట్లాడతామన్నారు.. పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అంశాలపై కేసీఆర్ తమకు ఒక బుక్‌లెట్ అందించారని రంజిత్ రెడ్డి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com