KCR: భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీ పెట్టమన్నారు- కేసీఆర్

KCR: భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీ పెట్టమన్నారు- కేసీఆర్
KCR: భారతీయ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీ పెట్టాలనే సలహాలను చాలా మంది ఇస్తున్నారని చెప్పుకొచ్చారు సీఎం కేసీఆర్.

KCR: భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీ పెట్టాలనే సలహాలను చాలా మంది ఎమ్మెల్యేలు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు జాతీయ స్థాయిలో భారత రాష్ట్ర సమితి కూడా ఉండాలంటున్నారని కేసీఆర్ అన్నారు. దేశ అభ్యున్నతి కోసం తెలంగాణ నుంచే తొలి అడుగు పడితే అదే తమకు గర్వకారణం అన్నారు సీఎం కేసీఆర్.

ఈ దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కావని, ఎవరినో గద్దె దించడం కోసమో, గద్దె ఎక్కించడం కోసమో తాను పనిచేయబోనని స్పష్టం చేశారు. ఇద్దరు సీఎంలతో మాట్లాడి, నాలుగు పార్టీలను జతచేయాల్సిన అవసరమే లేదన్నారు. ప్రజలే ఎజెండాగా ఫ్రంట్లు రావాలన్నారు. అద్భుతమైన దేశ నిర్మాణానికి ప్రక్రియ మొదలు కావాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్.

  • సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతున్న పార్టీ టీఆర్ఎస్‌- కేసీఆర్
  • ఎవరూ బద్దలు కొట్టలేని కంచుకోట టీఆర్‌ఎస్ పార్టీ- కేసీఆర్
  • ప్రజల ప్రయోజనాలు పరిరక్షించే కాపలాదారు టీఆర్‌ఎస్‌ పార్టీ- కేసీఆర్
  • తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్‌ఎస్‌..
  • వెయ్యి కోట్ల ఆస్తులున్న పార్టీ టీఆర్ఎస్
  • దేశంలో ఉత్తమమైన గ్రామాల్లో పదికి పది తెలంగాణవే..
  • దేశానికి రోల్‌ మోడల్‌గా తెలంగాణలో పరిపాలన సాగుతోంది
  • నిబద్ధతగా, అవినీతి రహితంగా పరిపాలన చేస్తున్నాం
  • తెలంగాణ జల భాండాగారంగా రూపుదిద్దుకుంది- కేసీఆర్
  • పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే..
  • తెలంగాణ మొత్తం పసిడి పంటలతో సుభిక్షంగా ఉంటుంది
  • వెలుగు జిలుగుల తెలంగాణను ఏర్పాటు చేసుకోగలిగాం..
  • సాగు, తాగు నీటి రంగాల్లో అద్భుత ఫలితాలు వచ్చాయి
  • నేను 50 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నాను- కేసీఆర్
  • తెలంగాణ మంత్రివర్గంలో పోయే వికెట్లు లేవు- కేసీఆర్
  • తెలంగాణలో అడ్డదిడ్డమైన వ్యవహారాలు లేవు..
  • తెలంగాణలో చాలా సందర్భాలు.. చాలా జ్ఞాపకాలు ఉన్నాయి
  • తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం చేయాలనే దానిపై నిద్రలేని రాత్రులు గడిపాం..
  • ప్రొ.జయశంకర్‌, విద్యాసాగర్‌తో మేధోమథం జరిగింది- కేసీఆర్
  • తెలంగాణ స్థూల ఆదాయం దేశం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ
  • సుమారు రెండున్నర లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం..
  • టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేసిన స్థాయిలో..
  • కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పని చేసి ఉంటే బాగుండేది- కేసీఆర్‌
  • 75 ఏళ్లలో దేశంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు..
  • పెడధోరణులు మరింత పెరిగిపోతున్నాయి.. మంచి మార్గం కానరావడం లేదు
  • సంకుచిత విధానాలు దేశాన్ని ప్రశ్నించేలా ఉన్నాయి
  • తెలంగాణ పని చేసిన పద్ధతిలో దేశం పని చేయడం లేదు..
  • అలా పని చేసి ఉంటే దేశంలో 24 గంటల కరెంట్‌ ఉండేది
  • దేశంలో 65 వేల టీఎంసీల కేటాయింపులు జరిగాయి
  • 30 వేల టీఎంసీల లోపే దేశం వాడుకుంటోంది
  • ఎక్కడ చూసినా దేశంలో నీటి యుద్ధాలే జరుగుతున్నాయి
  • ఎవరి అసమర్థత వల్ల ఇలా జరుగుతోంది?
  • తాగేందుకు నీరు లేని దుస్థితిలో దేశం ఉండాలా?
  • ఈ అంశాలపై చర్చ జరగాలి.. పరిష్కారాలు చూపాలి
  • దేశంలో అత్యధికంగా యువ శక్తి ఉంది
  • 13 కోట్ల మంది భారతీయులు ప్రతిభను విదేశాల్లో ఖర్చు చేస్తున్నారు
  • అన్నీ ఉన్నవారి దగ్గర ఆలోచన లేదు..
  • ఏమీ లేని వారు ఆలోచనతో పురోభివృద్ధి సాధిస్తున్నారు
  • అన్నీ మనకే తెలుసనే అహంకారాన్ని వదిలివేయాలి
  • తెలంగాణకు కేంద్రం నుంచి వందల అవార్డులు వచ్చాయి
  • ఆ మధ్య నా దగ్గరకు కమ్యూనిస్టులు వచ్చారు..
  • బీజేపీని గద్దె దించేందుకు అందరం ఏకం కావాలన్నారు...
  • చెత్త ఎజెండాతో వస్తే నేను కలవనని చెప్పా..
  • ఎవరినో గద్దె ఎక్కించేందుకు.. దించేందుకు కలవడమేంటి?
  • గద్దె ఎక్కించాల్సిందే భారత దేశ ప్రజలను..
  • దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది.. ఏ లక్ష్యం వైపు పయనిస్తోంది?
  • మన జిల్లా అంత ఉండదు ఇజ్రాయిల్.. అక్కడి నుంచి ఆయుధాలు తెచ్చుకుంటున్నాం
  • దేశ ప్రజలు ఒక్కతాటిపై నడవలేని పరిస్థితి ఎందుకు వచ్చింది?
  • కావాల్సింది, రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదు..
  • దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా- కేసీఆర్
  • ఎక్కడో ఒకచోట ఆ సిద్ధాంతానికి పునాది పడాలి

Tags

Read MoreRead Less
Next Story