KCR: నేటి నుండి కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభం.. ముందుగా జనగామలో..

KCR: తెలంగాణ సీఎం కేసీఆర్.. నేటి నుంచి రెండు రోజుల పాటు జిల్లాలలో పర్యటించనున్నారు. ఇవాళ జనగామ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి.. రేపు యాదాద్రి జిల్లాలో పర్యటిస్తారు. ఆయా జిల్లాలలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాలను, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అలాగే యాదాద్రిలో ఆలయ పునర్ నిర్మాణంలో భాగంగా నూతనంగా కట్టిన ప్రెసిడెన్షియల్ సూట్‌ను ప్రారంభింభిచనున్నారు.
సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో రెండు జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి నేరుగా జనగామ వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. జనగామలో కలెక్టరేట్ భవన సముదాయాలను, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ప్రధాని మోదీ.. తెలంగాణ ఏర్పాటుపై చేసిన విభజన వ్యాఖ్యల తర్వాత ముఖ్యమంత్రి తొలిసారిగా బహిరంగ సభలో మాట్లాడనున్నారు.
ఈ సభలో సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఏరకంగా స్పందిస్తారు..? బీజేపీని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారననేది ఆసక్తి రేపుతోంది. మరోవైపు జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నూతన భవనాలను నిర్మిస్తోంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ సమీకృత భవనాలను నిర్మించింది ప్రభుత్వం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com