KCR : జూబ్లీహిల్స్ రంగంలోకి కేసిఆర్.. మూడు అంశాలే ప్రధానం..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలోకి మాజీ సీఎం కేసీఆర్ దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కెసిఆర్ పెద్దగా బయటకు రావట్లేదు. ఎర్రవెల్లి లోని తన ఫామ్ హౌస్ లోనే ఉండిపోతున్నారు. ఆ మధ్య రెండు మీటింగ్ లు పెట్టిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బిఆర్ఎస్ స్టార్ క్యాంపెనర్ల లిస్టులో కెసిఆర్ పేరు ఉంది. దీంతో ఆయన ప్రచారానికి రాబోతున్నారని తేలిపోయింది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బి ఆర్ ఎస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది పార్టీకి సిట్టింగ్ స్థానం. ఇందులో ఓడిపోతే హైదరాబాద్ లో బీఆర్ఎస్ కి పట్టు తగ్గిపోయిందని అంటారు. అందుకే ఈ ఎన్నికలను బీఆర్ఎస్ చాలా సీరియస్ గా తీసుకుంది.
ముఖ్యంగా మూడు పాయింట్లు బీఆర్ఎస్ ఎక్కువగా హైలెట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇది గులాబీ పార్టీకి సిట్టింగ్ స్థానం. ఇక్కడి నుంచి గతంలో మూడుసార్లు మాగంటి గోపీనాథ్ గెలిచారు. ఆయనకు ప్రజల్లో మంచి ఇమేజ్ ఉంది. అది పార్టీకి కలిసొస్తుందని కేసీఆర్ భావించారు. అందుకే ఆయన సతీమణి సునీతకు టికెట్ ఇచ్చారు. రెండోది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి నుంచి ఇద్దరు పురుషులే పోటీ చేస్తున్నారు. కేవలం గులాబీ పార్టీ నుంచి మాత్రమే మహిళ అయిన సునీత పోటీ చేస్తుంది. కాబట్టి మహిళా సెంటిమెంట్ కలిసి వస్తుందని భావిస్తున్నారు.
దీనికి తోడు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేయబోతున్నారు. అప్పుడు కచ్చితంగా బీఆర్ ఎస్ గెలుస్తుందని పార్టీ భావిస్తోంది. ఈ మూడు అంశాలతో పాటు జూబ్లీహిల్స్ లో పార్టీ బలంగా ఉంది. కంటోన్మెంట్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తన సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు గులాబీ బాస్. అలా చేస్తే గ్రేటర్ లో తమ పట్టు తగ్గలేదని.. పైగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీపై వ్యతిరేతక పెరిగిందని ఒకేసారి నిరూపించవచ్చు. ఇదే అజెండాతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అందరికంటే ముందు నుంచే ప్రచారాన్ని హోరెత్తిస్తోంది గులాబీ దళం. ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి ప్రచారం చేస్తే మైలేజ్ మరింత పెరుగుతుందని పార్టీ భావిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com