KCR: బీజేపీ రాజకీయ స్వార్థాలకు బలికావద్దు- కేసీఆర్

KCR: వికారాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్.. బీజేపీపై, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ జెండాను చూసి మోసపోతే.. శఠగోపం తప్పదని హెచ్చరించారు. ఆ జెండాను పట్టుకుంటే మళ్లీ పాతకథే వస్తుందన్నారు.
తెలంగాణ ప్రజలు మోసపోతే గోసపడే పరిస్థితులు వస్తాయని, వచ్చిన తెలంగాణను మళ్లీ గుంటనక్కలు వచ్చి పీక్కొని తినకుండా, పాత పద్దతికి మళ్లీ పోకుండా, మళ్లీ పరిస్థితులు దిగజారకుండా, వారి రాజకీయ స్వార్థాలకు బలికాకుండా ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు.
అంతకుముందు వికారాబాద్ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నూతన కలెక్టరేట్ కాంఫ్లెక్స్‌ను ప్రారంభించిన కేసీఆర్... మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. అలాగే టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com