KCR : జూబ్లీహిల్స్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్.. కీలక ఆదేశాలు

KCR : జూబ్లీహిల్స్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్.. కీలక ఆదేశాలు
X

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ లో గెలవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో బీఆర్ ఎస్ కు ఉన్న పట్టు చేజారిపోతే పరిస్థితులు తారుమారు అవుతాయి. ఇప్పటికే కంటోన్మెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓడిపోయింది. హైదరాబాద్ లో పెద్దగా పట్టులేని కాంగ్రెస్ ఆ స్థానాన్ని కైవలం చేసుకుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కూడా అదే జరిగితే బీఆర్ ఎస్ మీద గ్రేటర్ లో టాక్ మారుతుంది. అందుకే నేరుగా గులాబీ బాస్ రంగంలోకి దిగిపోయారు. ఇన్ని రోజులు ఫామ్ హౌస్ లో ఉన్న ఆయన.. ఈ రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సన్నాహక సమావేశం నిర్వహించారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గ క్లస్టర్ ఇన్ చార్జులు, అన్ని డివిజన్ల ఇన్ చార్జులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలతో సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు పాటించాలి, ఎలాంటి ప్రచారాలు చేయాలనేది ప్రత్యేకించి చెప్పారు. పేద గర్భిణీల కోసం తీసుకొచ్చిన కేసీఆర్ కిట్ ను కాంగ్రెస్ ఎందుకు ఆపేసిందో ప్రజలకు వివరించాలన్నారు. యాదవులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కాబట్టి గొర్రెల పంపిణీ స్కీమ్ ను కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే ఆపేసిందని ఓటర్లకు చెప్పాలన్నారు. అలాగే చేప పిల్లల పంపిణీ కాంగ్రెస్ ఆపేయడంపై ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ వచ్చాక ఆపేసిన పథకాలు, ఇస్తానన్న హామీలు ఇవ్వకపోవడంపైనే ప్రధానంగా సిటీ ప్రజలకు వివరించాలన్నారు.

అలాగే కాంగ్రెస్ అభ్యర్థిపై కూడా కేసీఆర్ నిప్పులు చెరిగారు. రౌడీషీటర్ ను తీసుకొచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్నారు. ఇదే విషయాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లకు పెద్ద ఎత్తున ప్రచారం చేసి వినిపించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ స్వయంగా పాల్గొనబోతున్నారు. ఆయన రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితులు మారిపోతాయని గులాబీ దళం ఆశిస్తోంది. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న వారు కూడా కేసీఆర్ రాకను చూసి యాక్టివ్ అవుతున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ ఎస్ గెలిస్తే పట్టు నిలవడంతో పాటు.. గ్రేటర్ లో తమ బలం అలాగే ఉందని నిరూపించుకున్నట్టు అవుతుందని గులాబీ ప్రచారం చేసుకుంటుంది.

Tags

Next Story