TG : కాళేశ్వరం తప్పులకు కేసీఆర్‌దే బాధ్యత.. కమిటీ సారాంశంలో కీలక విషయాలు

TG : కాళేశ్వరం తప్పులకు కేసీఆర్‌దే బాధ్యత.. కమిటీ సారాంశంలో కీలక విషయాలు
X

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్ నివేదికను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. అయితే నివేదికపై అధికారుల కమిటీ అధ్యయనం చేసింది. దీనికి సంబంధించిన సారాంశాన్ని సిద్ధం చేసింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణ నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్‌దేనని తేల్చింది. నిపుణుల కమిటీ నివేదికను అప్పటి సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు పక్కకు పెట్టారని తెలిపింది. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదన్నది సహేతుక కారణం కాదని.. బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం జరగలేదని గుర్తించింది. వ్యాప్కోస్‌ నివేదిక, డీపీఆర్‌ కంటే ముందే బ్యారేజీలకు సిద్ధం అయినట్లు అధ్యయనంలో తేలింది.

టెండర్లు, ఓ అండ్‌ ఎం డిజైన్‌, నాణ్యతలో లోపాలున్నట్లు కమిషన్ గుర్తించింది. జవాబుదారీతనం, పాలనాపరమైన విధానాలు పాటించలేదని.. పాలనా విధానాలు అనుసరించకుండా హరీశ్‌రావు ఆదేశాలు ఇచ్చారని అధ్యయన కమిటీ సారాంశంలో ఉన్నట్లు సమాచారం. ఆర్థిక జవాబుదారీ తనాన్ని అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ పాటించలేదని.. కాళేశ్వరం బోర్డులో అధికారులు ఉన్నా వారికి సంబంధం లేదని ఈటల చెప్పినట్లు కమిషన్ విచారణలో తేలింది. ప్రణాళిక, నిర్మాణం, ఓ అండ్‌ ఎం, నీటినిల్వ, ఆర్థిక అంశాలకు అప్పటి సీఎందే బాధ్యత అంటూ నివేదిక సారాంశాన్ని అధికారుల కమిటీ సిద్ధం చేసింది.

Tags

Next Story