TG : నేనో అగ్నిపర్వతాన్ని..! నా బిడ్డను జైల్లో పెట్టారన్న కేసీఆర్

TG : నేనో అగ్నిపర్వతాన్ని..! నా బిడ్డను జైల్లో పెట్టారన్న కేసీఆర్
X

గులాబీ దళపతి కేసీఆర్ బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పలు హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటిందని, అయినా హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చేందుకు కావాల్సిన సమయం ఇచ్చామని, ఇక జనం గొంతుకగా అసెంబ్లీలో ప్రశ్నిద్దామని సూచించారు. తాను అగ్ని పర్వతంలా ఉన్నానని సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అన్నారు. పోరాటం విషయంలో తగ్గేదేలే అనే సంకేతాలను ఇచ్చారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడితేనే అసలైన గుర్తింపు వస్తుందని గులాబీ నేతలకు స్పష్టం చేశారు KCr. ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యలపై నిలదీయాల్సిందేనని ఖరాకండిగా చెప్పారు. అసెంబ్లీ సమావేశాల నుంచే దాన్ని మొదలుపెట్టాలని పార్టీ నేతలకు గులాబీ బాస్ వెల్లడించారు. రాజకీయ కక్షతోనే కవితను జైల్లో పెట్టిండ్రు భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రాజకీయ కక్షతోనే జైల్లో పెట్టారని అధినేత కేసీఆర్ అన్నారు. సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా..? అని ప్రశ్నించారు. ఆ బాధ ఉన్న మాట వాస్తవమేనని కేసీఆర్ ఎమ్మెల్యేలతో అన్నారు. తాను ఓ అగ్ని పర్వంతంలా ఉన్నానని చెబుతూనే కొంచెం ఉద్వేగానికి గురైనట్లుగా విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితిలో తెలంగాణను సాధించానని కేసీఆర్ స్పష్టం చేశారు. నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా..? అని పార్టీ ఎమ్మెల్యేలకు గుర్తు చేశారు. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవని, ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూసి తొందర పడొద్దని సూచనలు చేశారు. రాజకీయ నేత అంటే పరిపక్వతతో ఉండాలని చెబుతూనే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడితే ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని, ఎదిగేందుకు అవకాశం లభిస్తుందని స్పష్టం చేశారు.

Tags

Next Story