MLC Kavitha : కేసీఆర్ ఐఫోన్ రేవంత్ చైనా ఫోన్ : ఎమ్మెల్సీ కవిత

కేసీఆర్ పాలన ఐఫోన్ లాగా ఉంటే, రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లాగా ఉందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందన్నారు. బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వా న్ని చరిత్ర క్షమించదని హెచ్చరించారు. తన ఎండిపోయిన భూమిని చూపిస్తూ ఓ రైతు బాధ పడుతూ పెట్టిన మెసేజ్ చూస్తుంటే కళ్లకు నీళ్ల చ్చాయని తెలిపారు. జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కవిత మీడియాతో మాట్లాడుతూ 'శిశుపాలుడు కూడా నూరు తప్పుల తర్వాత శిక్ష పడ్డది. రేపు కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే అవుతుంది. కులగణనలో చెప్పినా 42 శాతం బీసీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వడం లేదు. అన్ని కులాల వివరాలు వెంటనే బయట పెట్టాలి.. బీసీ రిజర్వేషన్ అమలు చేసేదాకా కోసం ఉద్యమం చేస్తం. రాజకీయ కక్షలు పక్కనబె ట్టి కాళేశ్వరం నీళ్ల ద్వారా వరద కాల్వలను నింపాలి' అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ చర్చలు జరపకపోవడం బీసీలను అవమానించడమే అని విమర్శించారు. బీసీ కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలని, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 52 శాతం బీసీలు ఉన్నారని 2014లోనే కేసీఆర్ లెక్క తేల్చారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయమని.. ఈ తప్పుడు లెక్కలను రాహుల్‌గాంధీ పార్లమెంటును తప్పుదోవ పట్టించారని కవిత మాట్లాడారు. 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ప్రజలను మోసం చేసిందని అన్నారు. రేవంత్ తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com