KCR: మమతా బెనర్జీతో కలిసి కేసీఆర్ కూటమి..?

KCR: టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో మరో నేషనల్ ఫ్రంట్ ఆవిర్భవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు మమతా బెనర్జీ. బీజేపీతో KCR సంబంధాల విషయంలో ఇతర ప్రాంతీయ పార్టీల నేతలకు మెల్లిమెల్లిగా అనుమానాలు తొలగుతున్నాయి.
దీంతో రానున్న రోజుల్లో ఫ్రంట్ ఏర్పాటుల KCR కీలక పాత్ర పోషించేందుకు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు అంగీకరిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఢీల్లీలో విపక్ష పార్టీలకు చెందిన సీఎంల సమావేశం జరగనుంది. అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు పకడ్బందీ వ్యూహం అమలు చేస్తున్నారు. ఇందుకోసం ఇతర రీజనల్ పార్టీల నేతలతో కేసీఆర్, మమత మంతనాలు చేస్తున్నారు.
సీఎంల సమావేశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. ఢిల్లీలో జరిగే సమావేశానికి వీలైనంత ఎక్కువ మంది సీఎంలు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. జులైలో రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి ఎన్నికల నాటికి కూటమి ప్రయత్నాలు కొలిక్కి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే ఈ సమావేశానికి కాంగ్రెస్ సీఎంలకు ఆహ్వానంపై అస్పష్టత నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com