KCR: ఢిల్లీ దిశగా కేసీఆర్.. జాతీయ పార్టీగా బీఆర్ఎస్..!

KCR: ఢిల్లీ దిశగా కేసీఆర్.. జాతీయ పార్టీగా బీఆర్ఎస్..!
KCR: ఒక్కొక్క అడుగూ పడేకొద్దీ స్పష్టత వస్తోంది. గుణాత్మక మార్పు మాటలు ఇప్పుడు ఆచరణలోకి వస్తున్నాయ్‌.

KCR: ఒక్కొక్క అడుగూ పడేకొద్దీ స్పష్టత వస్తోంది. గుణాత్మక మార్పు మాటలు ఇప్పుడు ఆచరణలోకి వస్తున్నాయ్‌. జాతీయ స్థాయిలో BJPని ఢీకొట్టడమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి పెట్టేందుకు KCR ఇప్పటికే అవసరమైన కసరత్తు పూర్తి చేశారు. పార్టీ పేరు 'భారత రాష్ట్ర సమితా'.. లేదంటే 'భారత రాజ్య సమితా' అనే దానిపై కూడా పెద్ద చర్చ జరుగుతోంది. ఈ నెల 19న పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చించాక జాతీయ పార్టీపై కీలక ప్రకటన ఉండబోతోందంటున్నారు.

ఓ పక్క రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టే విషయంలో కాంగ్రెస్‌ను కాదని తానే నిర్ణాయక శక్తిగా ఉండాలని మమత దూకుడు ప్రదర్శిస్తున్న వేళ.. KCR జాతీయ కూటమి ప్రయత్నాలు ఎలాంటి ఫలితాన్ని చూపిస్తాయనేది ఆసక్తి రేపుతోంది. ఈ నెల 15న జరిగే మీటింగ్‌కు రావాలని KCRకు కూడా ఫోన్ చేశారు మమతాబెనర్జీ. ఈ పరిస్థితుల్లో ఆయన దీనిపై ఏం చేస్తారనేది కూడా ఆసక్తికరమే.

KCR ఢిల్లీ స్థాయిలో రాజకీయాలకు సిద్ధమైతే, BRSపై ప్రకటన చేస్తే అప్పుడు TRSను ఏం చేస్తారు అనే చర్చ కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. తెలంగాణ సెంటిమెంట్‌తో పుట్టిన పార్టీ TRS కాబట్టి .. రాష్ట్రంలో ఈ పార్టీని కొనసాగిస్తూ జాతీయ స్థాయిలో BRS అంటే అది గందరగోళానికి దారి తీస్తుందా అనే అనుమానాల్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే విశ్లేషకులు ఓ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

తృషముల్ కాంగ్రెస్ బెంగాల్‌తోపాటు, బీహార్‌, UP, ఈశాన్య రాష్ట్రాల్లో పోటీ చేస్తూ జాతీయ పార్టీగానే గుర్తింపు నిలబెట్టుకుంటోంది. ఆప్ కూడా ఇలాగే చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలోకి వచ్చింది. హర్యానా సహా మరికొన్ని చోట్ల పోటీ చేసింది. రేపు గుజరాత్‌లోనూ సై అంటోంది. జాతీయ రాజకీయాలు చేస్తున్నా అవన్నీ ఆప్‌ పేరుపైనే ముందుకెళ్తోంది. NCP కూడా ఇదే దారి. MIM కూడా అదే పేరుతో వివిధ రాష్ట్రాల్లో పోటీ చస్తోంది. కానీ TRSకు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరును వదులుకుని ఇప్పుడు BRSగా మారాల్సి వస్తుండడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది చర్చకు దారి తీసింది.

BRS ప్రకటించిన వెంటనే KCRతో చేతులు కలిపి ఆయన వెంట నడిచేందుకు వివిధ రాష్ట్రాల్లో ఎంత మంది సిద్ధంగా ఉన్నారు అంటే సమాధానం చెప్పడం కష్టమే. ఇప్పటికే మెజార్టీ ప్రాంతీయ పార్టీలు UPAతోనో, NDAతోనో జట్టుకట్టి ఉన్నాయి. అదే సమయంలో ఈ ఫ్రంట్‌ల పట్ల జనం అంత సంతృప్తితో లేరు అనేది KCR భావనగా కనిపిస్తోంది. అందుకే జాతీయ పార్టీని ప్రకటిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story