TG : బీఆర్ఎస్ లో కేసీఆరే సుప్రీం : హరీశ్ రావు

బీఆర్ఎస్ లో కేసీఆరే సుప్రీం అని, ఎవరి విషయంలోనైనా తుది నిర్ణయం పార్టీదే నని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. కలిసి పనిచేయడం, ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్ తమకు నేర్పించారని చెప్పారు. లండన్ లో జరిగిన బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నేతల మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో హరీశ్ మాట్లాడారు. 'కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అనేక అద్భుతాలు సాధించింది. కాళేశ్వరం అంటే లక్ష కోట్ల రూపాయలు పోయాయని దు ష్ప్రచారం చేస్తుండ్రు. రాష్ట్ర, మేడిగడ్డ మూడు పి ల్లర్లు కుంగితే రేవంత్రెడ్డి సర్కార్ రాద్ధాంతం చేస్తోంది. ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ ప్రభు త్వం ఏం చేస్తోంది. వానాకాలంలో కరెంట్ డిమాండే ఉండదు. ఆ సమయంలో బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తిపోసుకోవచ్చు. రైతుల ప్రయోజనాలు దెబ్బ తినే విధంగా రాజకీయా లు చేయకూడదు. హైడ్రాతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. ఎన్నారైలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదు. ఈరోజు పాలకులే నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమ వుతుంది. గతంలో మనం కూడా చిన్న చిన్న తప్పులు చేసినం. ఇప్పుడు వాటిని సరి చేసుకుని వెళ్తున్నం' అని తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com