KCR: భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలి: కేసీఆర్

KCR: దేశంలో అటవీప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు సీఎం కేసీఆర్. దీని కారణంగా వాతావరణ సమతుల్యత దెబ్బతిన్నదని, కాలుష్యం, వేడి పెరిగిందని శాసన సభలో వెల్లడించారు. జీడీపీలు పెంచినా వందల కోట్లు సంపాదించిపెట్టినా మన పిల్లలకు జీవించలేని వాతావరణం ఇవ్వకుంటే ఏం ప్రయోజనం లేదన్నారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేశామన్నారు.
ప్రపంచంలో కెనడాలో ఒక వ్యక్తికి 10వేల 163 మొక్కలు ఉన్నాయన్నారు. మన దేశంలో మాత్రం కేవలం ఒక వ్యక్తికి 28 మొక్కలు మాత్రమే ఉన్నాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఆయన రాష్ట్రవ్యాప్తంగా మొక్కల నాటడం ఓ ఉద్యమంగా చేపట్టామన్నారు. జీహెచ్ ఎంసి పరిధిలో పదికోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంటే 14 కోట్ల మొక్కలు నాటినట్లు వెల్లడించారు. ప్రతి గ్రామపంచాయతీలో నర్సరీలు ఏర్పాటుచేసినట్లు సీఎం వెల్లడించారు. ఇందుకు సహకరించిన సర్పంచ్‌లు, అధికారులను అభినందించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com