KCR : బసవేశ్వరుడి ఆశయాలు ఆదర్శమన్న కేసీఆర్

X
By - Manikanta |1 May 2025 11:15 AM IST
సామాజిక అభ్యుదయవాది, వీరశైవ లింగాయత్ ధర్మ వ్యవస్థాపకుడు బసవేశ్వరుని జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సామాజిక సేవను స్మరించుకున్నారు. ధార్మిక ప్రవచనాలు, వచన సాహిత్యం, వాటి కార్యాచరణ ద్వారా సమానత్వం కోసం పాటుపడిన గొప్ప సామాజిక విప్లవకారుడు బసవన్న అని కేసీఆర్ కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడిన దార్శనిక పాలకుడిగా ప్రజల మన్ననలు అందుకున్నారని అన్నారు. బసవేశ్వరుని ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com