KCR: రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వ్యూహమేంటి..? ఉమ్మడి అభ్యర్థి ఖాయమా?

KCR: రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వ్యూహమేంటి..? ఉమ్మడి అభ్యర్థి ఖాయమా?
KCR: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహం ఎలా ఉండబోతోంది..?

KCR: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహం ఎలా ఉండబోతోంది..? ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే దిశగా కేసీఆర్‌ పావులు కదుపుతున్నారా..? కీలకమైన ఈ సమయంలో మౌనంగా ఉండటం వెనుక మరో కారణం ఉందా..? ఇంతకూ కేసీఆర్‌ ఏం చేయబోతున్నారు..? రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన కదపబోయే పావుతో బీజేపీకి చెక్‌ పడుతుందా..? ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.. కేసీఆర్‌ అడుగులు ఎటువైపు అనేది కూడా సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. వచ్చే నెల 25తో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం ముగియనుంది.. ఈలోపే రాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది..

దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ కూడా విడుదలయింది.. దీంతో అన్ని పార్టీల్లో రాష్ట్రపతి ఎన్నికపైనే హాట్‌ హాట్‌ చర్చ నడుస్తోంది.. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికను ప్రిస్టేజియస్‌గా తీసుకుంది.. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ బలమేంటో చూపిస్తామని గతంలో అనేకసార్లు కేసీఆర్‌ చెప్పారు.. వరుసగా రాష్ట్రాలు తిరుగుతూ విపక్షాలను కలుస్తూ వచ్చారు.. వారందరినీ ఏకం చేయడమే లక్ష్యంగా పావులు కదిపారు.. రెండు నెలల్లో సంచలన ప్రకటన వింటారంటూ ఇటీవలే ఓ పవర్‌ఫుల్‌ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చారు.. కానీ, ఆ తర్వాత నుంచి కేసీఆర్‌ మాట ఎక్కడా వినిపించలేదు..

సమయం దగ్గర పడుతున్నా కేసీఆర్‌ ఎలాంటి ప్రకటనా చేయలేదు.. దీంతో కేసీఆర్‌ వ్యూహం ఏంటన్నది చర్చనీయాంశం అవుతోంది. అయితే, రాష్ట్రపతి ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు 2.2 శాతం ఓట్లున్నాయి.. ఇటు బీజేపీ మిత్రపక్షాలను కలుపుకున్నా సరిపోయేంత బలం లేదు.. బయటి నుంచి మద్దతు తీసుకుంటే తప్ప గెలిచే పరిస్థితి లేదు.. ఈ నేపథ్యంలోనే విపక్షాలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతాయని ప్రచారం జరిగింది.. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే కేసీఆర్‌ వ్యూహాలు కూడా కనిపించాయి.. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడం కోసమే కేసీఆర్‌.. విపక్ష పార్టీలన్నిటినీ కలిసినట్లుగా ప్రచారం జరిగింది..

అయితే, విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉందా అంటే చెప్పలేం.. దీంతో ఇప్పుడు కేసీఆర్‌ ఆలోచన ఏంటి..? ఏం మ్యాజిక్‌ చేయబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తటస్థంగా ఉండిపోతుందా..? లేక ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించుతుందా.. అన్నది చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి అభ్యర్థిగా మహారాష్ట్రకు చెందిన సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే పేరు వినబడుతుండగా.. మాజీ ప్రధాని దేవెగౌడ పేరు కూడా కేసీఆర్‌ ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది..

అయితే, ఆయన ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.. మరో ఇద్దరు కీలక నేతల పేర్లు కూడా ప్రతిపాదిస్తున్నట్లుగా చెబుతున్నా.. అన్నా హాజారేకే ఫిక్స్‌ అయినట్లుగా తెలుస్తోంది.. కానీ, అన్నా హాజారే అభ్యర్థిత్వాన్ని అన్ని పార్టీలు అంగీకరిస్తాయా అన్నది కూడా సందేహంగానే కనబడుతోంది.. అసలు కేసీఆర్‌ కట్టే కూటమికి ఎన్ని పార్టీలు మద్దతిస్తాయన్నది కూడా ఇప్పుడు సందేహమే.. మరోవైపు తన అభ్యర్థిత్వాన్ని అన్నా హాజరే అయినా అంగీకరిస్తారా అనేది కూడా డౌట్‌గానే ఉంది.

Tags

Read MoreRead Less
Next Story