KCR : ఏఐజీకి కేసీఆర్.. ఎందుకో తెలుసా?

KCR : ఏఐజీకి కేసీఆర్.. ఎందుకో తెలుసా?
X

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉదయమే ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు వెళ్లారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ kg చేరుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకున్నారు. బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో దాదాపు ఆరేడు గంటలు ఆయన గడిపారు. పార్టీ నేతలతో సుదీర్గంగా సమావేశమై అనేక అంశాలపై మేథోమథనం చేశారు. సమావేశం ముగిసేంత వరకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు, యువత తెలంగాణ భవన్ వద్దే ఉండిపోయారు. సమావేశం ముగిసిన తర్వాత ఆయన వెళ్లిపోతున్న సమయంలో సీఎం.. సీఎం.. తెలంగాణ హీరో అంటూ నినాదాలు చేశారు. వారందరికీ చిరునవ్వుతో నమస్కారం చేస్తూ వెళ్లిన ఆయన నందినగర్ లోని నివాసంలో రాత్రి ఉండి పోయారు. ఈ క్రమంలో గురువారం ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఆయన ఆరోగ్యంతో ఉన్నారని, కేవలం రెగ్యులర్ చెకప్ మాత్రమే చేసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే అమెరికా పర్యటన ఉండటంతో.. హెల్త్ సర్టిఫికెట్ కోసం పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం.

Tags

Next Story