KCR : కాళేశ్వరం విచారణకు హాజరుకానున్న కేసీఆర్

KCR : కాళేశ్వరం విచారణకు హాజరుకానున్న కేసీఆర్
X

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, ఆ విషయంపై లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్రప్రభుత్వం నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణకు హాజరవ్వాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత నిర్ణయించడం పెను సంచలనంగా మారింది. జూన్ 5న విచారణకు హాజరవ్వాలంటూ జస్టిస్ ఘోష్ కమిషన్ నోటీసులు పంపిన నేపథ్యంలో ఆయన హాజరవుతారా? లేదా అనే విషయమై కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతుండగా కేసీఆర్ తాజా నిర్ణయం వెలువడింది. జూన్ 6న మాజీ మంత్రి హరీష్ రావు, 9న మాజీమంత్రి, ప్రస్తుత ఎంపీ ఈటల రాజేందర్ లు హాజరవ్వా లంటూ కమిషన్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

విచారణకు హాజరవుతామని హరీష్, ఈటల ఇప్పటికే ప్రకటించగా, ఇప్పుడు కేసీఆర్ నిర్ణయం వెలువడింది. దీంతో ఒక్కసారిగా రాజ కీయ వాతావరణం మారిపోయింది. నోటీసు అందిన తర్వాత అనేక పరిణామాలు విచారణకు రావాలని నోటీసు అందుకున్నప్ప టి నుంచి పార్టీలో కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు కావాలా లేదా అని పార్టీలో తర్జనభర్జన జరిగింది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో సన్నిహితులతో పలుమార్లు ఈ అంశంపై చర్చించారు.

Tags

Next Story