22న సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ పర్యటన

సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైంది. ఈనెల 22న పటాన్చెరుకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. అనంతరం కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభోత్సవం చేయనున్నారు. కొల్లూరులో 144 ఎకరాల విస్తీర్ణంలో 15,640 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించింది GHMC. 1350 కోట్ల వ్యయం ఈ నిర్మాణాలు పూర్తి చేసింది. ఒకే చోట 15640 ఇళ్ళు నిర్మించడం ఆసియాలోనే రికార్డు. 11 అంతస్తుల్లో 114 బ్లాకుల్లో అత్యంత ఆధునిక పద్దతిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. లక్ష మంది నివసించే విధంగా కొల్లూరు డబుల్ బెడ్ మోడల్ కాలనీ సిద్ధం అయ్యింది. టౌన్ షిప్స్, గ్రేటెడ్ కమ్యూనిటీలను తలదాన్నేలా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. ఇక కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, ప్లేగ్రౌండ్ లు, ఫంక్షన్ హాళ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు మురుగునీరు శుద్ధి చేసేలా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించారు. సోలార్ వీధి దీపాలు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, పాఠశాల, అంగన్‌వాడి కేంద్రాలను ఏర్పాటు చేశారు. బస్టాప్, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేశారు. ఇక ప్రతి బ్లాక్ లో రెండు లిఫ్టులు ఏర్పాటు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com