KCR : ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు.. కేసీఆర్ కు ఆ మాత్రం తెలియదా..?

మాజీ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత మొన్న బయటకు వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు మీద రకరకాల కామెంట్లు చేశారు. అప్పుడెప్పుడో వర్కౌట్ అయిన ఏపీ, తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ రగిల్చే ప్రయత్నం ఆయన మాటల్లో కనిపించింది. ఆయన మొన్న మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు నాయుడు ఆర్భాటమే తప్ప.. అక్కడ ఎలాంటి పెట్టుబడులు రాలేదన్నారు. ఆయన గతంలో అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా అదే జరుగుతోందని చెప్పారు. వంట చేసే వాళ్లతో ఒప్పందాలు చేసుకున్నారని కేసీఆర్ చెప్పడం నిజంగా హాస్యాస్పదమే అవుతుందని అంటున్నారు కూటమి నేతలు. మొన్న జరిగిన విశాఖ ఇండస్ట్రియల్ సమ్మిట్ లో ఎలాంటి పెట్టుబడులు రాలేదని కేసీఆర్ చెప్పారు. ఆయనకు నిజంగానే పెట్టుబడుల గురించి తెలియదేమో అనుకుంటున్నారు కూటమి నేతలు.
ఎందుకంటే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. టీసీఎస్ కంపెనీ, క్వాంటమ్ కంప్యూటర్స్ కంపెనీ, అదానీ డేటా సెంటర్, రిలయల్స్.. ఇలా ఎన్నో ప్రఖ్యాత కంపెనీలు ఏపీకి వచ్చాయి. ఇదే విషయాన్ని స్వయంగా ఆ కంపెనీలే ప్రకటించాయి కదా. ఇప్పటికే అక్కడ పనులు కూడా ప్రారంభించారు. గూగుల్ డేటా సెంటర్ రావడంపై సీఎం చంద్రబాబు కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అభినందించారు. మరి ఆ విషయం మాజీ సీఎం కేసీఆర్ కు తెలియనిది కాదేమో. కానీ ఆయన ఇలాంటి కామెంట్ చేశారు. ఇందులో ఆయన వ్యూహం వేరే అయి ఉండొచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
బీజేపీని ఇరకాటంలో పెట్టాలనే ఉద్దేశంతో ఏపీలో పొత్తులో ఉన్న చంద్రబాబును ఆయన కామెంట్ చేసి ఉంటారని అంటున్నారు. అక్కడ చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే.. తెలంగాణలో ఉన్న బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలని.. అప్పుడు ఆ పార్టీని ఇరకాటంలో పెట్టే ప్లాన్ కూడా ఉండి ఉండొచ్చు. కానీ ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే కేసీఆర్ మాత్రం ఇలా ఏమీ రాలేదని చెప్పడంలో నిజం లేదంటున్నారు కూటమి నేతలు. చంద్రబాబు పేరు చెప్పకుండా కేసీఆర్ రాజకీయాలు చేయలేరా అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదు కదా. పైగా తెలంగాణలో టీడీపీ పోటీ కూడా చేయట్లేదు. అలాంటప్పుడు చంద్రబాబును ఇలా టార్గెట్ చేయడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

