KCR : కేసీఆర్ ఆదేశం.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నెల జీతం విరాళం

KCR : కేసీఆర్ ఆదేశం.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నెల జీతం విరాళం

తెలంగాణలో సంభవించిన వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు తమ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన, బీఆర్ఎస్ ప్రతినిధులు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు.

ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై కేసీఆర్ విచారం వ్యక్తం చేశారని, బాధితులకు సాయం అందించాలని ఆయన ఆదేశించారని హరీష్ తెలిపారు. నిత్యావసర సరుకులను గురువారం సిద్దిపేట నుంచి ఖమ్మం వరద బాధితులకు పంపిస్తున్నామని, వాటిని ఇంటింటికీ అందిస్తామని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీరిచ్చే కానుక ఇదేనా! సాంఘిక సంక్షేమ శాఖ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్ టైమ్ టీచర్లు, లెక్చరర్లు, డీఈవోలను ఏకకాలంలో విధుల నుండి తొలగించడం దుర్మార్గమైన చర్యగా మాజీ మంత్రి హరీష్ రావు అభివర్ణించారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Tags

Next Story