TG : పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల కీలక నిర్ణయం

TG : పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల కీలక నిర్ణయం
X

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ అధ్యక్షతన జరిగే సీఎల్పీ సమావేశానికి హాజరుకావొద్దని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఇదే విషయమై అసెంబ్లీ సెక్రటరీ ఈ ఎమ్మెల్యేలకు నోటిసులు జారీ చేశారు.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎంసీహెచ్ఆర్డీలో సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, దుష్ప్రచారాన్ని అడ్డుకోవడంతో పాటు ఇతర అంశాలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

Tags

Next Story